Home » Film News
Tuesday, 3 February 2015
Srinu Vaitla - Kona Venkat - Gopimohan Teaming Again

మమ్ముల్ని ఆదరిస్తున్న సినీ ప్రియులకు నమస్కారాలు, నేను,కోన గారు కలిసి చేస్తున్న కధలు,సినిమాల విశేషాలు మీతో పంచుకోవాలని అనిపించింది. అనిల్ సుంకర గారి AK Entertainments లో సునీల్ హీరోగా నా దర్శకత్వం లో నేను,కోన గారు కలిసి ఒక విభిన్నమైన కధని రూపొందించడం జరిగింది. దిల్ రాజు,వాసు వర్మ,సునీల్ సినిమా తో పాటు మా సినిమా కూడా పార్లల్ గా షూటింగ్ జరుపుకుంటుంది.రఫ్ గా మార్చ్ ఎండ్/ఏప్రిల్ లో మొదలవుతుంది. లౌక్యం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ గారి కోసం Entertainment తో కూడిన హై voltage Action & family కధని రూపొందించడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో మిగతా వివరాలు అనౌన్స్ చెయ్యడం జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్లగారి direction లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు అనేకం. జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి,అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని ,వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది. మా కలయికలో రాబోయే రామ్ చరణ్,సమంతల నూతన చిత్రం చాలా మంచి కధ తో,శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది.మా మార్కు మంచి హాస్యము ఉంటుంది.శ్రీను వైట్ల గారు,మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది.ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రామ్ చరణ్ మాతో ఎంతో ఇష్టపడి గత 6 నెలలుగా చేయించుకుంటున్న ఇంకో సబ్జెక్టు కూడా ఈ సినిమా తదనంతరం మొదలవుతుంది.అన్నీ confirm అయ్యాక మిగతా వివరాలు అనౌన్స్ చేస్తారు.
Tags: Film News
Comments[ 0 ]
Post a Comment